logo
Published : 03/12/2021 03:18 IST

పంటల మార్పిడిపై కార్యాచరణ

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న పాలనాధికారి నారాయణరెడ్డి, ఇతర అధికారులు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: యాసంగిలో వరి కొనుగోళ్లు ఉండవని..రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని పాలనాధికారి నారాయణరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులతో గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లాభసాటిగా ఉండే ఆరుతడి పంటలపై శనివారం నుంచి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ధర గిట్టుబాటు అయ్యేలా మిల్లర్లు, వ్యాపారులతో కొనుగోలు ఒప్పందాలు ఉంటేనే సాగు చేయాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారి నర్సింగ్‌దాస్‌ మాట్లాడుతూ పండ్లు, పూలు, కూరగాయలు, అయిల్‌పాం, కుసుమ సాగు చేసుకోవచ్చన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చేపల చెరువులు అభివృద్ధి చేసుకోవచ్చని మత్స్యశాఖ సహాయ సంచాలకులు ఆంజనేయస్వామి పేర్కొన్నారు. హెక్టారుకు రూ.11 లక్షల యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు 60, ఇతర వర్గాలకు 40 శాతం రాయితీ ఇస్తామన్నారు. 8 ఎకరాల వరకు చెరకు సాగు చేస్తే..కొనుగోలు చేసేలా తాము ఒప్పందాలు చేయిస్తామని చెరకు బోర్డు అసిస్టెంట్‌ కమిషనర్‌ రవి చెప్పారు. తాము 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు సొంతంగా కొనుగోలు చేయగలమని రైసు మిల్లుల సంఘం నేత మోహన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సగం దొడ్లు, సగం సన్నాలు పండించాలని చెప్పారు. అనంతరం కరపత్రాలు, గోడప్రతులను ఆవిష్కరించారు. జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, సీనియర్‌ శాస్త్రవేత్తలు బాలాజీనాయక్‌, నవీన్‌ పాల్గొన్నారు.

లక్ష్యం చేరుకుంటే అవార్డులు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌: ఇచ్చిన లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్‌ ఈ నెల 31 వరకు పూర్తి చేసిన వారికి జనవరి 26న అవార్డులు అందజేస్తామని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. ఇందుకు నాలుగు పంచాయతీలు, పురపాలక సంఘాలను ఎంపిక చేస్తామని, ప్రతి ఒక్కరు పోటీ పడాలన్నారు. జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ ఇద్రిస్‌ఖాన్‌, స్థానిక సంస్థల అదనపు పాలనాధికారిణి చిత్రామిశ్రా, డీఆర్డీవో చందర్‌, జడ్పీ సీఈవో గోవింద్‌, శివశంకర్‌ ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని