logo
Published : 27/11/2021 03:35 IST

కలిసొచ్చిన సాంకేతికత

గణనీయంగా తగ్గిన అపరిష్కృత కేసులు

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

పోలీసుశాఖలో సాంకేతికత వినియోగం సత్ఫలితాలను అందిస్తోంది. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. గతేడాది అక్టోబరు వరకు 4,401 కేసులు ఈ కేటగిరిలో ఉండగా.. ఇప్పటి వరకు ఆ సంఖ్య 1,703కు తగ్గింది. మరోవైపు శిక్షల రేటు 55 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.

* కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష ఎప్పుడు జరిగినా అపరిష్కృత కేసులపైనే సుదీర్ఘంగా చర్చించేవారు. ఆరు నెలల క్రితం ఇదే విషయంలో ఓ సీఐ, ఎస్సైని విధుల నుంచి తొలగించారు. తదనంతరం ఎస్‌హెచ్‌వోలు దృష్టి పెట్టడంతో ఈ కేసులు 50 శాతానికి తగ్గినట్లు తెలుస్తోంది. ‘డీజీపీ ఆదేశాల మేరకు అపరిష్కృత కేసుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. డీసీపీ అరవింద్‌ బాబు ఆధ్వర్యంలో తరచుగా సమీక్షలు జరిపి కేసుల పరిష్కారానికి సూచనలు చేశారని’ సీపీ కార్తికేయ తెలిపారు.

మెరుగైన సేవలు అందిస్తే రివార్డులు

రెంజల్‌, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించే సిబ్బందికి రివార్డులు అందిస్తామని, సీపీ కార్తికేయ తెలిపారు. రెంజల్‌ ఠాణాను శుక్రవారం సందర్శించారు. కమ్యూనిటీ పోలీసు వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని ఎస్సై మురళిని ఆదేశించారు. ఇన్‌ఛార్జి ఏసీపీ స్వామి, గ్రామీణ సీఐ రవీందర్‌నాయక్‌ ఉన్నారు.

బోధన్‌: సీపీ కార్తికేయ బోధన్‌ గ్రామీణ సీఐ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఏసీపీ రామారావు, సీఐలు రవీందర్‌నాయక్‌, ప్రేమ్‌కుమార్‌ ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని