logo
Published : 28 Nov 2021 04:21 IST

రుణం పొందుదాం.. పాల ఉత్పత్తి పెంచుదాం

న్యూస్‌టుడే, బీర్కూర్‌

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ ఓ గ్లాసు పాలు తాగాలని వైద్యుల సూచన. పాలల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. శరీరానికి అవసరమయ్యే కాల్షియం దీని నుంచే వస్తుంది. పాలతో ఆరోగ్యాన్ని కాపాడటం, రోగాలను నయం చేయడంతో పాటు పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. కానీ మన రాష్ట్రంలో పాల ఉత్పత్తి తగ్గిపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాం. ఈ నేపథ్యంలో పాల దిగుబడిని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పొరుగు రాష్ట్రాల నుంచి సంకర జాతి గేదెలు, ఆవులను కొనుగోలు చేసి పాల ఉత్పత్తి పెంచేందుకు డ్వాక్రా మహిళలకు ప్రోత్సాహం అందిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో డ్వాక్రా సంఘాలు, గ్రామ సంఘాలు, కామారెడ్డి జిల్లాలో 726 గ్రామ సంఘాలుండగా, 17,518 డ్వాక్రా సంఘాలున్నాయి. మొత్తం సభ్యులు 1.81 లక్షల మంది. నిజామాబాద్‌ జిల్లాలో 806 గ్రామ సంఘాలు, 24,110 డ్వాక్రా సంఘాలుండగా 2.52 లక్షల మంది సభ్యులున్నారు.

విధి విధానాలు

* అర్హత సంఘాలను గుర్తించి ఒక్కో సంఘంలో ఇద్దరు లేదా ముగ్గురు సభ్యులకు పాడి రుణం మంజూరు చేస్తారు.

* పాడి రుణాలు ఎవరెవరికి అవసరముందో గ్రామ సంఘం తీర్మానం చేసుకొని స్థానికంగా ఉండే సీఎకు దరఖాస్తు చేసుకోవాలి. వారం తర్వాత రుణాలు మంజూరు అవుతాయి.

* దరఖాస్తు చేసుకొనేందుకు డిసెంబరు ఆఖరు వరకు చివరి గడువు ఉండగా, ఆవులకు ఫిబ్రవరి వరకు అవకాశం ఉంది.

* ఒక్కో పాడి గేదె కొనుగోలు నిమిత్తం రూ.85,200 నగదు సభ్యురాలి వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తారు. రూ.75 వేలు పాడి గేదె కొనుగోలు చేసేందుకు రూ.10,200 రెండు నెలల వరకు పశువుల దాణా, రవాణా ఛార్జీల కోసం చెల్లిస్తున్నారు.● తీసుకొన్న పాడి గేదెతో పాటు సభ్యురాలికి బీమా సదుపాయం కల్పించారు. ఇవన్నీ కలిపి ఒక్కో గేదెకు ప్రభుత్వం రూ.93,270 చెల్లిస్తుంది.

* మొదటి విడతలో ఒక గేదె తీసుకొన్న ఆరు నెలల తర్వాత రెండో గేదెకు రుణం మంజూరు చేస్తారు.


పొరుగు రాష్ట్రాల్లో సంకర జాతి పశువులు

పాడి గేదెతో డ్వాక్రా మహిళ

* మన రాష్ట్రంలో పశువుల సంఖ్య, పాల దిగుబడి తగ్గిపోవడంతో ప్రభుత్వం పాడి గేదెలను తప్పనిసరిగా పోరుగు రాష్ట్రాల్లోనే కొనుగోలు చేయాలని నిబంధన పెట్టింది.

* ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో సంకర జాతికి చెందిన ముర్రె గేదె, హెచ్‌ఎఫ్‌ జెర్సీ ఆవులను మాత్రమే కొనుగోలు చేయాలి.


సద్వినియోగం చేసుకోవాలి

రవికుమార్‌ స్త్రీనిధి జోనల్‌ మేనేజర్‌, కామారెడ్డి

పాల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తుంది. దిగుబడి పెంచడంతో పాటు మహిళలు ఆర్థిక ఎదుగుదలకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పొరుగు రాష్ట్రాల్లోనే సంకరజాతి పశువులనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని