logo
Published : 01/12/2021 04:19 IST

రూ.638 కోట్లు చెల్లించాం: కలెక్టర్‌

డిచ్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లాలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి ఇప్పటివరకు రూ.638 కోట్లు చెల్లించామని, మూడు రోజుల్లో మిగిలిన చెల్లింపులు చేపడతామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. మంగళవారం డిచ్‌పల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇప్పటి వరకు 5.75 లక్షల మె.ట ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మార్కెట్‌లో డిమాండు ఉన్న పంటలే యాసంగిలో వేయాలని సూచించారు. వ్యవసాయ విస్తరణాధికారులు అన్నదాతలకు సలహాలు, సూచనలు చేయాలన్నారు. తహసీల్దారు శ్రీనివాస్‌రావు, సొసైటీ ఛైర్మన్‌ జైపాల్‌ ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని