logo
Published : 01 Dec 2021 04:19 IST

సిరివెన్నెలతో అనుబంధం మర్చిపోలేం

నెల్లూరులో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో సీతారామశాస్త్రితో వీపీ చందన్‌రావు (కుడివైపు చివరి వ్యక్తి)

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఇందూరు కవులతో అనుబంధం ఉంది. ఒకరు ఆయనతో వేదికను పంచుకోగా మరొకరు శాస్త్రి రాసిన పాటను హిందీలో అనువదించి తన అభిమానాన్ని చాటుకున్నారు. మంగళవారం ఆయన మృతి చెందారని తెలియగానే తెలుగు సాహితీ రంగం, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కవిసమ్మేళనంలో కలిశాను
..వ్యాఖ్యాత, కవి, వీపీ చందన్‌రావు

ఆల్‌ ఇండియా రేడియో నెల్లూరు కేంద్రం వారు 1982లో నిర్వహించిన జాతీయ కవిసమ్మేళనంలో వ్యాఖ్యాతగా వ్యవహరించాను. ఆ వేదికపై సీనియర్‌ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాడుగుల నాగఫణిశర్మ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఓలేటి పార్వతీశం అతిథులుగా హాజరయ్యారు. అప్పటికే ఆయన సినిమాల్లో పాటలు రాస్తున్నారు. ప్రముఖ తెలుగు కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావం సీతారామశాస్త్రిపై ఉంది. అందుకే అంతగొప్పగా పదబంధాలు రాయగలిగారు. ఎప్పటికీ మరిచిపోలేని గీతాలను అందించారు.

భారతీయ వైభవం హిందీలో అనువదించా..
..విరాట్‌, శ్రీమన్నారాయణాచారి, హిందీ కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిజామాబాద్‌

2020లో మహాశివరాత్రికి ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రూపొందించిన ‘భారతీయ వైభవం’ కోసం సిరివెన్నెల రాసిన తెలుగు పాటను హిందీలో అనువదించే అవకాశం వచ్చింది. ఆయన రాసిన ‘యోగులు సాగిన మార్గమిది’ పాటను హిందీలో ‘రుషిముని యోంకా మార్గ యహీ‘గా రాశాను. పాట మూలం మరిచిపోకుండా బాగా రాశానని ఆయన ప్రశంసించారు.


పలువురి సంతాపం : ఆణిముత్యాల్లాంటి పాటలతో తనదైన ముద్ర వేసుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిచెందడం తెలుగు సినీ రంగానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. ఇందూరు భారతి అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌, కందాళై రాఘవాచార్య, మేక రామస్వామి, హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌, కాసర్ల నరేశ్‌రావు, నరాల సుధాకర్‌, దశరత్‌ కోత్మీకర్‌ తమ సంతాపాన్ని ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని