logo

ఇంధన ధరలు తగ్గించే వరకు నిరసనలు

రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించే వరకు జిల్లా వ్యాప్తంగా రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ..

Published : 05 Dec 2021 05:33 IST
గాంధీచౌక్‌ వద్ద ధర్నా చేస్తున్న భాజపా నాయకులు, కార్యకర్తలు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఇంధన ధరలు తగ్గించే వరకు జిల్లా వ్యాప్తంగా రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌ వద్ద ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నిర్ణయం మేరకు 22 రాష్ట్రాల్లో సీఎంలు స్పందించి ధరలు తగ్గించారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామియాదవ్‌, నాయకులు పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, గంగాధర్‌, రమాకాంత్‌, కిశోర్‌, అరుణ, జ్యోతి పాల్గొన్నారు.

యువమోర్చాను బలోపేతం చేయాలి

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లాలో యువమోర్చాను సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ.. ‘వన్‌ యూత్‌ టెన్‌ బూత్‌’ నినాదంతో ప్రతి పోలింగ్‌ బూత్‌కు పది మంది యువకులతో కమిటీ వేయాలన్నారు. ప్రజాసమస్యలు పరిష్కరించే వరకు ధర్నాలు, నిరసనలు చేపట్టాలని ఆదేశించారు. రాజు, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి మహేందర్‌, సుధీర్‌, బాలు, విజయ్‌కృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని