logo

నేటి నుంచి ఇంటింటా జ్వర సర్వే

కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఐకేపీ, మెప్మా అధికారులతో వీసీ

Published : 21 Jan 2022 03:35 IST

వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, చిత్రంలో డీఎం

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటా జ్వర సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌, ఐకేపీ, మెప్మా అధికారులతో వీసీ ద్వారా మాట్లాడారు. గ్రామాలు, వార్డుల వారీగా ఒక్కో బృందం 50 ఇళ్లల్లో వివరాలు సేకరించాలన్నారు. ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐదు రోజుల్లో జిల్లా మొత్తం పూర్తి చేయాలని సూచించారు. కొవిడ్‌ లక్షణాలతో బాధపడేవారికి హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలన్నారు. సర్వే అనంతరం బాధితుల ఆరోగ్య పరిస్థితిని నిత్యం వాకబు చేయాలని ఆదేశించారు. ఐదు రోజులైనా నయం కాకుంటే ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. 15- 17 ఏళ్ల వారికి కొవిడ్‌ మొదటి డోసు వేయించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే, డీఎంహెచ్‌వో కల్పనాకాంటే, డీపీవో ప్రభాకర్‌, అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని