logo

పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.

Updated : 27 Apr 2024 06:44 IST

తుది జాబితా విడుదల చేసిన అధికారులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ కలెక్టరేట్‌

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ గ్రామీణం, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పరిధిలో 17,04,867 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు.

నెల రోజుల్లో పెరుగుదల

నెల రోజుల్లో పార్లమెంట్‌ పరిధిలో ఓటర్లు పెరిగారు. ఫిబ్రవరి 8న ఓటర్ల తుది జాబితా ప్రకటించగా 17,01,573 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం మార్చి 16న పార్లమెంట్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయగా అప్పటి నుంచి కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఈ నెల 15 చివరి తేదీగా ప్రకటించారు. గడిచిన నెల రోజుల్లో 3,294 మంది ఓటర్లు పెరిగారు. ఈ ఓటర్ల జాబితాలో పేర్లున్న వారందరూ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది.

మహిళలే అధికం..

లోక్‌సభ స్థానం పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితం అతివల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఏడు నియోజకవర్గాల్లో నెల రోజుల్లో మహిళలు పేర్లు నమోదు చేసుకునేందుకు ఆసక్తి కనబర్చారు. యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఓటర్ల వివరాలు

పురుషులు: 8,06,130
మహిళలు: 8,98,647
ట్రాన్స్‌జెండర్స్‌: 90
మొత్తం : 17,04,867

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని