logo

2 నదులు 2 లోక్‌సభ నియోజకవర్గాలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది.

Published : 27 Apr 2024 03:15 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలైన కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌, ఎల్లారెడ్డి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, అందోల్‌ల్లో మంజీర నది పారుతుంది. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌ మినహాయిస్తే బోధన్‌, బాల్కొండ, ఆర్మూర్‌, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో గోదావరి ప్రవహిస్తుంది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గోదావరి, మంజీర నదులు ఆయా నియోజకవర్గాలకు భౌగోళిక గుర్తింపుగా మారాయి.

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని