logo

టీఈఏ జిల్లాఅధ్యక్షుడిగా నాగరాజు

తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఈఏ) జిల్లా అధ్యక్షుడిగా కెంపుల నాగరాజును నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో సంఘం పటిష్ఠతకు, ఉద్యోగుల సంక్షేమానికి

Published : 23 Jan 2022 04:19 IST

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఈఏ) జిల్లా అధ్యక్షుడిగా కెంపుల నాగరాజును నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో సంఘం పటిష్ఠతకు, ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. నాగరాజు జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. ఆయన నియామకంపై రాష్ట్ర కన్వీనర్‌, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఇన్‌ఛార్జి వేముల రాధిక హర్షం వ్యక్తం చేశారు.


టీఈఏ జిల్లా అధ్యక్షుడిగా రేవంత్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఉద్యోగుల సంఘం(టీఈఏ) జిల్లా అధ్యక్షుడిగా రేవంత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమార్‌ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో రేవంత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని