logo

మహారాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.4 లక్షల

Published : 28 Jan 2022 03:23 IST

సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న సీపీ నాగరాజు, చిత్రంలో డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీ వెంకటేశ్వర్‌

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.4 లక్షల సొత్తును రికవరీ చేశారు. కమిషనరేట్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీపీ అరవింద్‌ బాబు, ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌, ఎస్సై లింబాద్రితో కలిసి సీపీ కె.ఆర్‌.నాగరాజు కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన శివప్రసాద్‌, అక్షయకుమార్‌, ఆనంద్‌కృష్ణ, ప్రేమ్‌భాస్కర్‌ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వీరిలో ఆనంద్‌కృష్ణ గత కొద్ది నెలలుగా నగరంలో ఉంటూ రెక్కీ నిర్వహించాడు. అనంతరం మరో ముగ్గుర్ని ఈ నెల 16న పిలిపించాడు. అదేరోజు రాత్రి నీల కంఠేశ్వరనగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. 24న పగటిపూట ఓ అపార్టుమెంట్‌ ఫ్లాట్లో దొంగతనం చేశారు. మరో ఫ్లాట్లో చోరీకి యత్నిస్తుండగా స్థానికులు అరవడంతో అక్కడి నుంచి తప్పించుకొన్నారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలు, టవర్‌ డంప్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొన్నారు. వీరి నుంచి 7 తులాల బంగారం, 27 తులాల వెండిని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండుకి తరలించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన రూరల్‌ ఎస్సై లింబాద్రి, సిబ్బంది కిరణ్‌గౌడ్‌, మహేశ్‌బాబు, ప్రవీణ్‌, నాగరాజును సీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని