logo

అధిక ఛార్జీలు తగవు

వాహన సామర్థ్య పరీక్ష ఆలస్యమైతే రోజుకు రూ.50 చొప్పున అధిక ఛార్జీ వసూలు చేయాలనే ఉత్తర్వును రద్దు చేయాలని సీఐటీయూ, ఆటో, లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు

Published : 20 May 2022 03:10 IST

జిల్లాకేంద్రంలో నిరసన తెలుపుతున్న ఆయా పక్షాల ప్రతినిధులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: వాహన సామర్థ్య పరీక్ష ఆలస్యమైతే రోజుకు రూ.50 చొప్పున అధిక ఛార్జీ వసూలు చేయాలనే ఉత్తర్వును రద్దు చేయాలని సీఐటీయూ, ఆటో, లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగారు. జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించారు.  సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. రవాణాశాఖ అధికారులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా సంఘాల ప్రతినిధులు మాజిద్‌, వాజిద్‌, సాజిద్‌, నర్సింలు, అరుణ్‌ తదితరులున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని