logo

‘ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించొద్దు’

ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసీ, విద్యుత్తు తదితర విభాగాలను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం ఆలోచన దారుణమని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా

Published : 15 Aug 2022 06:01 IST


బాన్సువాడలో కళాకారులతో కోలాటం ఆడుతున్న సభాపతి పోచారం

బాన్సువాడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసీ, విద్యుత్తు తదితర విభాగాలను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్రం ఆలోచన దారుణమని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం బాన్సువాడలో జానపద కళాకారుల ప్రదర్శన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఉత్తమ ప్రతిభ చాటిన వారిని సన్మానించారు. కళాకారుల ఆట, పాటలు అందరినీ అలరించాయి. ఆర్డీవో రాజాగౌడ్‌, డీఎస్పీ జైపాల్‌రెడ్డి, సీఐ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ గంగాధర్‌, పురపాలక కమిషనర్‌ రమేష్‌కుమార్‌, రైసస జిల్లా సమన్వయకర్త అంజిరెడ్డి, బల్దియా ఛైర్మన్‌ గంగాధర్‌, వైస్‌ ఛైర్మన్‌ జుబేర్‌, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్‌, గురువినయ్‌, గోపాల్‌రెడ్డి, బాబా, జ్యోతి, రమాదేవి, రుక్మిణి, అనిత, ప్రతిమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని