logo

మొగి పురుగు... రైతుల్లో గుబులు

వరి సాగు రైతుల్లో మొగి పురుగు గుబులు పుట్టిస్తోంది. నారు మొదలుకుని పైరు వరకు నాశనం చేస్తోంది. దోమకొండ, సంగమేశ్వర్‌, గొట్టిముక్కుల, అంచనూరు, అంబారిపేట గ్రామాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

Published : 30 Jan 2023 03:04 IST

దోమకొండలో ఎండుతున్న వరి పైరు

వరి సాగు రైతుల్లో మొగి పురుగు గుబులు పుట్టిస్తోంది. నారు మొదలుకుని పైరు వరకు నాశనం చేస్తోంది. దోమకొండ, సంగమేశ్వర్‌, గొట్టిముక్కుల, అంచనూరు, అంబారిపేట గ్రామాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. పైరు కుదుళ్ల చేరిన పురుగు పంటను ఎదగనీయకుండా చేస్తోంది. చలి తీవ్రత, వాతావరణ పరిస్థితుల కారణంగానే సోకుతోందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి క్షేత్రాలన్నింటికి ఒకేసారి నివారణ చర్యలు చేపడితే బాగుంటుందని దోమకొండ ఏవో పవన్‌కుమార్‌ తెలిపారు. క్లోరాంతోప్రోనీల్‌తో పాటు లంబ్డాసిహలొత్రిన్‌ 100 మి.లీ. ద్రావణం ఎకరా పొలానికి పిచికారీ చేయాలని సూచించారు.

న్యూస్‌టుడే, దోమకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని