logo

బూస్టర్‌ డోస్‌కు దూరం

కామారెడ్డి జిల్లాలో కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోవడానికి జనం ఆసక్తి చూపడం లేదు. ఇటీవల 10 వేల డోసులు జిల్లాకు తెప్పించినా ఆరోగ్యకేంద్రాలకు వచ్చేవారే కరవయ్యారు.

Updated : 26 May 2023 06:39 IST

సరిపడా జనం రాక వాయిల్స్‌ తెరవని వైనం

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: కామారెడ్డి జిల్లాలో కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ తీసుకోవడానికి జనం ఆసక్తి చూపడం లేదు. ఇటీవల 10 వేల డోసులు జిల్లాకు తెప్పించినా ఆరోగ్యకేంద్రాలకు వచ్చేవారే కరవయ్యారు. కనీసం పది మంది వస్తేగాని టీకా వాయిల్స్‌ తెరవగలమని వైద్యశాఖ సిబ్బంది చెబుతున్నారు. అనేక ఆరోగ్యకేంద్రాల్లో టీకా నిల్వలను మూలన పెట్టారు. విదేశాలకు వెళ్లేవారు మాత్రమే టీకా తీసుకుంటున్నారు. మొదటి, రెండో డోసులు పూర్తయినవారు మూడో టీకాకు స్పందించడం లేదు. 3వ డోసుతో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయనే అపోహ అనేక మందిలో ఉంది. రెండు డోసులు తీసుకున్నవారికి మూడోది అవసరమని వైద్యశాఖ చెప్పినా స్పందన కరవైంది.

* జిల్లాకేంద్రంలోని పట్టణ ఆరోగ్యకేంద్రానికి 12-18 మంది వరకు టీకా తీసుకోవడానికి వస్తున్నారు. కొవిడ్‌ పరీక్షలకు, వ్యాక్సిన్‌ కోసం ఈ కేంద్రంలో మెరుగైన సేవలందాయి. జిల్లా ఆసుపత్రి, బాన్సువాడ, ఎల్లారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రులు, మిగతా సామాజిక, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో టీకా తీసుకునే నాథుడే కరవయ్యారు.

వృథా అవుతుందని..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా జనం వస్తేనే టీకా ఇవ్వగలుగుతాం. లేకుంటే వాయిల్‌ తీశాక వినియోగించకుంటే వృథా అవుతుంది. ఒకరిద్దరి కోసం వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తే పది మంది రాకపోవడంతో సమస్య ఎదురవుతోంది.

లక్ష్మణ్‌సింగ్‌, డీఎంహెచ్‌వో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని