logo

ముందస్తు పన్ను రాయితీపై ఆసక్తి

ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్‌ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే.

Published : 20 Apr 2024 06:21 IST

 రాష్ట్రస్థాయిలో ఆర్మూర్‌ 11వ స్థానం

న్యూస్‌టుడే, ఆర్మూర్‌ పట్టణం: ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల వసూలులో ఆర్మూర్‌ బల్దియా ముందంజలో ఉంది. ఈనెల 1 నుంచి 30 వరకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన పన్ను రుసుముపై 5 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆర్మూర్‌ పురపాలిక రాష్ట్రస్థాయిలో 11వ స్థానంలో ఉంది. గడిచిన 18 రోజుల్లో ఈ లక్ష్యాన్ని అందుకొంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని పురపాలికల్లో ఆర్మూర్‌ ముందు ఉంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ, రాయితీపై పట్టణంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 81.86 శాతం వసూలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.5.68 కోట్ల డిమాండ్‌ ఉండగా ఈనెల 1 నుంచి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఇప్పటికే 13.56 శాతం వసూలు చేశారు.

సిబ్బంది సహకారంతోనే.. రాజు, పుర కమిషనర్‌, ఆర్మూర్‌

ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలోనే ఆర్మూర్‌ బల్దియాకు 11వ స్థానం వచ్చింది. 5 శాతం రాయితీపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. బిల్‌ కలెక్టర్లు సైతం నిర్దేశించిన లక్ష్యం కోసం ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు. సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైంది. మిగిలిన  11 రోజుల్లో మరింత ఎక్కువగా వసూలు చేసి, రాష్ట్రంలో మొదటి     5 స్థానాల్లో ఉండేందుకు కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని