logo

కాంగ్రెస్‌ శ్రేణుల్లో హుషారు

నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు

Published : 23 Apr 2024 06:54 IST

బహిరంగ సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలు
నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నిర్వహించిన తొలి ఎన్నికల సభకు భారీగా జనం తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా ఇతర నాయకులు తమ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు. పాత కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించిన సభ రెండు గంటలు ఆలస్యంగా మొదలైనప్పటికీ సభికులు ఓపికగా కూర్చున్న తీరుకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలపై వాక్బాణాలు వేస్తున్న సందర్భంలో కార్యకర్తలు సానుకూలంగా ప్రతిస్పందించారు. కళా బృందం పాటలకు నృత్యాలు చేస్తూ హుషారెత్తించారు. సభలో స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని రైతుల సమస్యలు, ఇతర విషయాలపై హామీలు ఇవ్వటం పార్టీకి కలిసొచ్చే అంశంగా నాయకులు చెబుతున్నారు. ఈ ఉత్సాహంతో రానున్న రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని చెబుతున్నారు. హనుమాన్‌ మాలధారులు పలువురు సభావేదికపైకి చేరుకొని..జీవన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలుకు ధరావతు రుసుమును విరాళంగా అందించారు. సోమవారం ముఖ్యమంత్రితో కలిసి నామినేషన్‌ వేయాలని చూడగా.. ఆయన రాక ఆలస్యమైంది. మూడు గంటల వరకే సమయం ఉండటంతో వాయిదా వేసుకున్నారు. మంగళ, బుధవారాల్లో వేస్తానని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సభలో మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్‌, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ఈరవత్రి అనిల్‌, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అన్వేష్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, కాసుల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, ఏ.లలిత, రాజేశ్వర్‌, నాయకులు వినయ్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గడుగు గంగాధర్‌, నగేష్‌రెడ్డి, నిజామాబాద్‌ నగర అధ్యక్షుడు కేశ వేణు, డాక్టర్‌ కవితారెడ్డి, అట్లూరి రమాదేవి, నరాల రత్నాకర్‌, శేఖర్‌గౌడ్‌, సుజాత, నగేశ్‌రెడ్డి పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని