logo

‘పది’లమైన ఫలితాలు

పదో తరగతి ఫలితాల్లో ఈ సారి 14వ స్థానంలో నిలిచింది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 11,144 మంది బాలురు, 10,714 బాలికలు మొత్తంగా 21858 మంది పరీక్షలకు హాజరయ్యారు.

Published : 01 May 2024 05:35 IST

జిల్లాలో 93.72 శాతం ఉత్తీర్ణత
రాష్ట్రంలో 14వ స్థానం
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం

దో తరగతి ఫలితాల్లో ఈ సారి 14వ స్థానంలో నిలిచింది. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 11,144 మంది బాలురు, 10,714 బాలికలు మొత్తంగా 21858 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 10,330 బాలురు, 10156 మంది బాలికలు.. మొత్తంగా 20,486 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 2008, 2009, 2010లో వరుసగా ప్రథమ స్థానంలో, విడిపోయాక పదిలోపు ర్యాంకు సాధించింది. గతేడాది 87.12 శాతం ఉత్తీర్ణతతో 21 స్థానం సాధించగా ప్రస్తుతం 93.72 శాతంతో స్థానాన్ని పదిలపర్చుకుంది.

జూన్‌ 3 నుంచి సప్లిమెంటరీ..

జూన్‌ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందునా రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలకు ఎదురుచూడకుండా జూన్‌లో నిర్వహించే పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సందేహాలుంటే రీకౌంటింగ్‌ కోసం విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున 15 రోజుల్లో ఎస్‌బీఐలో చలానా తీసి కార్యాలయానికి పంపాల్సి ఉంటుందని వెల్లడించారు.

జవాబు పత్రాలకు ఇలా..

రీవెరిఫికేషన్‌, జవాబు పత్రాలు పొందాలనుకునేవారు దరఖాస్తు ఫారాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులతో ధ్రువీకరించుకొని హాల్‌టికెట్‌ జిరాక్స్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో సమర్పించాలి. ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చలానా తీయాల్సి ఉంటుంది. వివరాలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలి. ఇందుకు 15 రోజుల గడువు విధించారు.


284 మందికి 10 జీపీఏ

జిల్లావ్యాప్తంగా 284 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా ఇందులో బాలికలే 201 మంది ఉండటం గమనార్హం. అత్యధికంగా ప్రైవేటు విద్యసంస్థల నుంచి 181 మంది పది గ్రేడ్‌ పాయింట్లు పొందారు. 12 బీసీ గురుకులాల నుంచి 25 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.


అందరి సమన్వయంతోనే సాధ్యమైంది

- దుర్గాప్రసాద్‌, డీఈవో, నిజామాబాద్‌

కలెక్టర్‌ ఆదేశాల మేరకు బోధన, బోధనేతన సిబ్బంది, అధికారుల సమన్వయంతో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధించాం. అనుత్తీర్ణులైన విద్యార్థుల విషయంలోనూ తల్లిదండ్రులు సంయమనంతో వ్యవరించాలి. ఫలితాలతో కుంగిపోకుండా జూన్‌లో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని