logo

‘నాకు మద్దతివ్వండి’

జహీరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను బాన్సువాడలో ఆదివారం మున్నూరుకాపు సంఘం నాయకులు కలిశారు. అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ తాను మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవాడినని, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు.

Published : 06 May 2024 04:30 IST

అనిల్‌కుమార్‌ను సన్మానిస్తున్న సంఘం నాయకులు

బాన్సువాడ, న్యూస్‌టుడే : జహీరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ను బాన్సువాడలో ఆదివారం మున్నూరుకాపు సంఘం నాయకులు కలిశారు. అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ తాను మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందినవాడినని, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. గెలిస్తే సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. సంఘం నాయకులు దాసరి శ్రీనివాస్‌, కొత్తింటి గంగారాం, గోపాల్‌, లక్ష్మణ్‌, గంగారాం తదితరులు పాల్గొన్నారు.

‘హామీల అమలులో నిర్లక్ష్యం’

బాన్సువాడ పట్టణం: బోర్లం గ్రామంలో భారాస నియోజకవర్గ బాధ్యుడు పోచారం భాస్కర్‌రెడ్డి ఆదివారం ప్రచారం చేశారు. హామీల అమల్లో కాంగ్రెస్‌ నాయకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పారు. ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారన్నారు. రెండు పడకగదుల ఇళ్ల బిల్లులు రూ. 26 కోట్లను ఆయన ఆపారన్నారు. గాలి అనిల్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింలు, సాయిలు, వెంకట్రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని