logo

ప్రేరణ శిక్షణ శిబిరానికి ఇద్దరు విద్యార్థుల ఎంపిక

గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు డీఈవో రాజు ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 07 May 2024 19:33 IST

కామారెడ్డి పట్టణం: గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు డీఈవో రాజు ఓ ప్రకటనలో తెలిపారు. జవహార్ నవోదయ విద్యాలయ విద్యార్థి అరుణ్‌కుమార్, జంగంపల్లి జ్యోతిబాపూలే విద్యార్థిని భావజ్ఞ ఈ నెల 26 నుంచి 31వరకు జరిగే శిక్షణకు హాజరవుతారన్నారు. ప్రాయోగిక విద్య, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, విలువల ఆధారిత విద్యపై వీరికి శిక్షణ ఇస్తారని డీఈవో వెల్లడించారు. నాయకత్వం, వినయం, స్వాభిమానం తదితర అంశాల్లో ప్రేరణాత్మక శిక్షణ ఇస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, ప్రిన్సిపల్స్ సత్యావతి, మణిదీప్తి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని