logo

స్కాన్‌ చెయ్‌.. చదివెయ్‌

ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది.

Published : 09 May 2024 02:56 IST

క్యూఆర్‌ కోడ్‌తో అందుబాటులో కథలు, నవలలు

లిటరసీ క్లౌడ్‌ క్యూఆర్‌ కోడ్‌

న్యూస్‌టుడే, కామారెడ్డి విద్యావిభాగం: ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో పఠన నైపుణ్యం పెంపొందించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. చదవడం, రాయడం అలవాటు చేయడం ద్వారా మౌఖిక భాష వికాస అభివృద్ధికి దోహదం చేయనుంది. అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఇంటివద్దనే లిటరసీ క్లౌడ్‌ మాధ్యమం ద్వారా విద్యార్థులకు ఆకర్షణీయమైన, అభిరుచిని కలిగించే తెలుగు పుస్తకాలను రూమ్‌ టు రీడ్‌ ఇండియా ట్రస్ట్‌ ద్వారా అందులో పొందుపరిచారు. ఇవి విద్యార్థుల్లో చదవడం అలవాటు పెంచేందుకు ఉపకరిస్తుంది.

ఇంటి వద్దే చదివించేలా..

ఎండలు మండుతున్నాయి. పిల్లలంతా ఇంటి వద్ద చరవాణులు, టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు యంత్రాంగం వినూత్న పంథా అనుసరిస్తోంది. పిల్లలు ఇంటివద్దే సెలవులను ఆహ్లాదంగా గడపడానికి అధికారులు నిర్దేశించిన లిటరసీ క్లౌడ్‌ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా సంబంధిత వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. అక్కడ కథల పుస్తకాలు, నవలలు, సందేశాత్మక చిత్రాలు ప్రత్యక్షమవుతాయి. పుస్తకాలను చదవడం ద్వారా పఠనాసక్తి పెరుగుతుంది.
http:///literacycloud.org/stories?language=telugu&short=new%20arrivals లింక్‌ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవచ్చు.

జ్ఞానం పెంపొందించడానికే..

వేణుశర్మ, విద్యాశాఖ సమన్వయకర్త-  కామారెడ్డి జిల్లా

పిల్లల్లో జ్ఞానం పెంపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నాం. లిటరసీ క్లౌడ్‌ ద్వారా విద్యార్థులకు ఆయా అంశాల్లో అవగాహన కల్పించనున్నాం. ఇచ్చిన లింక్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా కథల పుస్తకాలు, నవలలు, వివిధ చిత్రాల సమాచారం తెలుసుకోవచ్చు. ఇవి వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని