logo

ఏకలవ్య గురుకులాల్లో ఇంటర్ కళాశాల అడ్మిషన్లు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గాంధారి (బాలుర), ఇందల్వాయి (బాలికలు) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో ఖాళీ సీట్ల అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Published : 09 May 2024 16:21 IST

కామారెడ్డి పట్టణం: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని గాంధారి (బాలుర), ఇందల్వాయి (బాలికలు) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్‌లో ఖాళీ సీట్ల అడ్మిషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయ అధికారి టి.సంపత్ కుమార్, నోడల్ ప్రిన్సిపల్ సోమ్లా నాయక్ తెలిపారు. ఈనెల 21 వరకు గిరిజన విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. 2023-24 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ లేదా స్టేట్ సిలబస్‌లో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన గిరిజన విద్యార్థులు సంబంధిత పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఆయా పాఠశాలల్లోని ప్రధానాచార్యులను సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని