logo

ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా

ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రశ్నించారు.

Published : 10 May 2024 02:46 IST

మాట్లాడుతున్న భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ ప్రశ్నించారు. గురువారం ఆర్మూర్‌ పట్టణంలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌వి 420 హామీలని ఆరోపించారు. పసుపు బోర్డు, గల్ప్‌ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏమైందని భాజపా అభ్యర్థి అర్వింద్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కవిత కృషితోనే ఆడబిడ్డలకు బీడీ పింఛన్లు వచ్చాయని గుర్తు చేశారు. 1994లో ఆర్మూర్‌ ప్రజలు స్వతంత్య్ర అభ్యర్థిగా గెలిపించారని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తానన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక రైతుబంధు, రైతు రుణమాఫీ లేదు, తులం బంగారం లేదని ఎద్దేవా చేశారు. కోరుట్ల, జగిత్యాల్‌, బాల్కొండలో భారాస ఎమ్మెల్యేలు ఉన్నారని, సర్వేల ప్రకారం మనం గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అర్వింద్‌ విద్వేషాలు రెచ్చగొట్టడమే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. భాజపా, కాంగ్రెస్‌ నాయకుల మాటలు తప్ప, ప్రజలకు చేసింది శూన్యం అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్‌ నాయకులు నకిలీ అని ఆరోపించారు. ఆయన వెంట భారాస జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు పూజ నరేందర్‌, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని