logo

శాస్త్ర, విజ్ఞాన రంగంలో ముందంజ వేయాలి: పండా

వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న రాష్ట్రం శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో ముందంజ వేయాలన్నది ప్రభుత్వ ధ్యేయమని సంబంధిత శాఖ మంత్రి అశోక్‌చంద్ర పండా పేర్కొన్నారు. మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లోని విజ్ఞాన్‌ భవన్‌లో విజ్ఞాన్‌ పరిషత్‌ వార్షికోత్సవం నిర్వహించారు.

Published : 23 Jun 2022 04:08 IST

జ్యోతి వెలిగిస్తున్న మంత్రి అశోక్‌, కార్యదర్శి మనోజ్‌, విజ్ఞాన పరిషత్‌ అధ్యక్షుడు బిభూతి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న రాష్ట్రం శాస్త్ర, విజ్ఞాన రంగాల్లో ముందంజ వేయాలన్నది ప్రభుత్వ ధ్యేయమని సంబంధిత శాఖ మంత్రి అశోక్‌చంద్ర పండా పేర్కొన్నారు. మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లోని విజ్ఞాన్‌ భవన్‌లో విజ్ఞాన్‌ పరిషత్‌ వార్షికోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పండా మాట్లాడుతూ... ఉన్నత విద్యావంతులు మానవాళికి ఉపయోగపడే పరిశోధనలు చేయాలని, కొత్త ఆవిష్కరణలు చేయాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో శాస్త్ర, విజ్ఞానశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి మనోజ్‌ మిశ్ర, పరిషత్‌ అధ్యక్షుడు బిభూతి మిశ్ర, ఇతర అధికారులు, పరిశోధకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని