logo

75 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా 60 ఏళ్ల వృద్ధుడు సైకిల్‌పై ప్రయాణిస్తూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’పై అందరికీ అవగాహన కల్పించారు. సిమిలిగుడకు చెందిన ఎస్‌.చిన్నారావు జయపురం-కొరాపుట్‌ మార్గంలోని దేవ్‌ఘాట్‌ నుంచి శనివారం

Published : 14 Aug 2022 04:53 IST

సిమిలిగుడలో చిన్నారావుకు స్వాగతం పలుకుతున్న స్థానికులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల సందర్భంగా 60 ఏళ్ల వృద్ధుడు సైకిల్‌పై ప్రయాణిస్తూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’పై అందరికీ అవగాహన కల్పించారు. సిమిలిగుడకు చెందిన ఎస్‌.చిన్నారావు జయపురం-కొరాపుట్‌ మార్గంలోని దేవ్‌ఘాట్‌ నుంచి శనివారం ఉదయం సైకిల్‌ యాత్ర ప్రారంభించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొఠియా వైపు 75 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆయనకు కొరాపుట్‌, సునాబెడ, సిమిలిగుడ, కుందిలి ప్రాంతాల్లో ప్రజలు స్వాగతం పలికారు. సిమిలిగుడలో సహీద్‌ లక్ష్మణ్‌ నాయక్‌ స్టడీ సర్కిల్‌ అధ్యక్షులు అజయ్‌కుమార్‌ సాహు, పురాధ్యక్షుడు రాజేంద్రకుమార్‌ పాత్ర్‌ తదితరులు పూలమాల వేసి యాత్ర విజయవంతం కావాలని ఆకాక్షించారు. అమృతోత్సవాలు, దేవ్‌మాలి సంరక్షణ, వివాదాస్పద కొఠియా గ్రామాలు ఒడిశాకు చెందినవేనని ప్రజల్లో చైతన్యం కలిగించడమే ఈ యాత్ర ఉద్దేశమని ఆయన ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. సాయంత్రానికి కొఠియా చేరుకొని, అక్కడ జాతీయ జెండా ఎగురవేసి, స్థానిక గిరిజనులకు అమృతోత్సవాలపై అవగాహన కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని