logo

రావణ దహనోత్సవం నేడే

ఖరగ్‌పూర్‌ దసరా ఉత్సవ కమిటీ 1925లో ప్రారంభించిన రావణ దహనోత్సవం నేటికీ కొనసాగుతోంది. స్థానిక కొత్తకోళీ ప్రాంతంలోని రావణ మైదానంలో బుధవారం నిర్వహించనున్న ఉత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Published : 05 Oct 2022 02:29 IST

సిద్ధమైన రావణుడి పది తలలు

ఖరగ్‌పూర్‌, న్యూస్‌టుడే: ఖరగ్‌పూర్‌ దసరా ఉత్సవ కమిటీ 1925లో ప్రారంభించిన రావణ దహనోత్సవం నేటికీ కొనసాగుతోంది. స్థానిక కొత్తకోళీ ప్రాంతంలోని రావణ మైదానంలో బుధవారం నిర్వహించనున్న ఉత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు సంస్థ ఆజాద్‌ బాయ్స్‌ క్లబ్‌ సభ్యులు.. పది తలలు, 20 చేతులు, 55 అడుగుల ఎత్తులో రావణుడి దిష్టిబొమ్మను తయారు చేశారు. బొమ్మ సిద్ధమైనప్పటికీ మైదానంలో నిలబెట్టడం సవాలుతో కూడుకున్నది. ఇందు కోసం క్లబ్‌ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు.  ఈ కార్యక్రమం వీక్షించేందుకు వేల సంఖ్యలో సందర్శకులు తరలి రానున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వర్షం పడుతుండడంతో ఉత్సవానికి వరుణుడి ఆటంకం కలిగిస్తాడేమోనని ఆందోళన చెందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని