logo

జగన్నాథునికి 821 రకాల నైవేద్యం

అచ్యుతం, కేశవం, రామనారాయణం, జగన్నాథం భజే.. అన్న ప్రార్థనలతో పూరీలోని పవిత్ర మాతా మఠం మార్మోగింది. మార్గశిర శుక్ల ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వ్యంజన ద్వాదశి పూజలు ఏర్పాటయ్యాయి.

Published : 06 Dec 2022 03:24 IST

మాతశ్రీ మఠంలో వ్యంజన ద్వాదశి వేడుకలు

మాతామఠంలో పురుషోత్తమునికి అర్పణైన వంటకాలు

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: అచ్యుతం, కేశవం, రామనారాయణం, జగన్నాథం భజే.. అన్న ప్రార్థనలతో పూరీలోని పవిత్ర మాతా మఠం మార్మోగింది. మార్గశిర శుక్ల ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వ్యంజన ద్వాదశి పూజలు ఏర్పాటయ్యాయి. ఆనవాయితీ ప్రకారం.. పురుషోత్తముకి 821 రకాల వ్యంజనాలు (వంటకాలు) నైవేద్యంగా సమర్పించారు. సాధుసన్యాసులు, తత్వసంపన్నులు, అతిథులు, భక్తులందరికీ ప్రసాదాలు అందజేశారు. పూరీ శ్రీక్షేత్రంతో మాతా మఠానికి సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్నాథునికి సంబంధించిన వేడుకలన్నీ ఇక్కడ ఆనవాయితీ ప్రకారం నిర్వహించారు. వ్యంజన ద్వాదశిని పురస్కరించుకుని శ్రీక్షేత్రంలోని రత్న సింహాసనంపై పురుషోత్తమ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో సేవాయత్‌లు ప్రత్యేక సేవలు నిర్వహించారు.

శ్రీక్షేత్రంలో నల్లనయ్య శోభ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని