logo

కొరాపుట్‌ అభివృద్ధికి 113 ప్రాజెక్టులు మంజూరు

విశ్వవిద్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు.

Published : 04 Feb 2023 03:08 IST

ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌

ఎస్‌హెచ్‌జీ బృందానికి నమూనా చెక్కు అందజేస్తున్న నవీన్‌ పట్నాయక్‌

జయపురం, న్యూస్‌టుడే: విశ్వవిద్యాలయంలో ఆడిటోరియం నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు. కొరాపుట్‌ జిల్లా జయపురం విక్రమ్‌ దేవ్‌ కళాశాలలో జరుగుతున్న వజ్రోత్సవాలకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కళాశాల వర్సిటీ హోదాను పొందినట్లు  ప్రకటించారు. నేటి విద్యార్థులు రేపటి రాష్ట్ర పౌరులని, ప్రతి ఒక్కరి జీవితంలో విద్య చాలా కీలక పాత్రను పోషిస్తుందని, బాగా చదువుకోవాలని ఆకాంక్షిస్తూ కళాశాలకు వర్సిటీ హోదా ఇచ్చానన్నారు. 113 ప్రాజెక్టులతో కొరాపుట్‌ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. జిల్లాలో నిర్మించనున్న 113 అభివృద్ధి పథకాలకు రూ.1,596 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు నవీన్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి మాట్లాడుతూ కొరాపుట్‌లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని, సిమిలిగుడలో వ్యవసాయ కళాశాలను, జయపురంలో బీఈడీ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు. 5-టి కార్యదర్శి వి.కె.పాండ్యన్‌, ఎస్సీ, ఎస్టీ అభివృద్ధిశాఖ మంత్రి జగన్నాథ్‌ సర్కార్‌, విద్యాశాఖ మంత్రి రోహిత్‌ పూజారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్‌ హల్దార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే, ఎంపీలతోపాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, పాలనాధికారి మహ్మద్‌ అబ్దల్‌ అక్తర్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చివరిలో సీఎం, పాలనాధికారి కొరాపుట్‌ పోస్టల్‌ కవర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి ముఖ్యమంత్రిని సన్మానించి, రాజా విక్రమ్‌ దేవ్‌ విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం నవీన్‌ జిల్లాలోని వివిధ స్వయం సహాయక బృందాల అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసి, చెక్కులను అందజేశారు.

విక్రమ్‌ దేవ్‌ విగ్రహాన్ని సీఎంకు అందజేస్తున్న ఎమ్మెల్యే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని