logo

‘అద్వితీయ’ డాక్యుమెంటరీ చిత్రానికి అంతర్జాతీయ ఫిల్మ్‌ అవార్డు

గంజాం జిల్లా హింజిలికాటులోని ‘నృత్యం కళా పరిశోధన కేంద్రం’ చిత్రీకరించిన ‘అద్వితీయ’ డాక్యుమెంటరీ చిత్రం మారిషస్‌ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డుకు ఎంపికైందని చిత్ర దర్శకుడు కృష్ణ డీకే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 31 Mar 2023 02:39 IST

 

‘అద్వితీయ’ డాక్యుమెంటరీ చిత్రం గోడపత్రిక
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా హింజిలికాటులోని ‘నృత్యం కళా పరిశోధన కేంద్రం’ చిత్రీకరించిన ‘అద్వితీయ’ డాక్యుమెంటరీ చిత్రం మారిషస్‌ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అవార్డుకు ఎంపికైందని చిత్ర దర్శకుడు కృష్ణ డీకే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మారిషస్‌లో ఏప్రిల్‌ 29న జరగనున్న ‘ఇండియన్‌ ఓషన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ఈ అవార్డు అందజేస్తామని ఫిల్మ్‌ ఫెస్టివల్‌ డైరెక్టరు వరుణ్‌ నుంకూ లేఖ రాశారని వివరించారు. అవార్డు అందుకునేందుకు తనతోపాటు రచయిత సిమాంచల మహరణను కూడా ఆహ్వానించారని తెలిపారు. గంజాం జిల్లాలోని అస్కా ఠాణా ప్రాంతం అత్యంత సమస్యాత్మకమైంది. దీని పరిధిలో నేరాల నియంత్రణ, నేరగాళ్లలో మార్పు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు అస్కా ఠాణా ఐఐసీ చేసిన కృషి, ఫలితంగా జాతీయ స్థాయిలో ఈ ఠాణా మొదటి స్థానంలో నిలవడం తదితర అంశాలను ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు కృష్ణ డీకే పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని