logo

Odisha: నదిలో రబ్బరు ట్యూబుపై రోగి తరలింపు

కొంధమాల్‌ జిల్లా బలిగుడ ఠాణా పరిధిలో మహాసింఘ్‌ పంచాయతీలోని కుబేరముండా గ్రామానికి చెందిన అనంతి ప్రధాన్‌ (45) అనే రోగిని భర్త రఘునాథ ప్రధాన్‌, ఇతర కుటుంబ సభ్యులు రబ్బరు ట్యూబుపై ఖడ్గ నదిని దాటించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌్ అయింది.

Updated : 14 Sep 2023 08:43 IST

రబ్బరు ట్యూబుపై రోగిని తరలిస్తున్న గ్రామస్థులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కొంధమాల్‌ జిల్లా బలిగుడ ఠాణా పరిధిలో మహాసింఘ్‌ పంచాయతీలోని కుబేరముండా గ్రామానికి చెందిన అనంతి ప్రధాన్‌ (45) అనే రోగిని భర్త రఘునాథ ప్రధాన్‌, ఇతర కుటుంబ సభ్యులు రబ్బరు ట్యూబుపై ఖడ్గ నదిని దాటించిన వీడియో బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌్ అయింది. అనంతి నాలుగు రోజులుగా అతిసారంతో బాధపడుతోంది. ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మహాసింగ్‌కు ఆమెను తరలించాలంటే గ్రామానికి సమీపంలో ప్రవహిస్తున్న ఖడ్గ నది దాటాల్సిందే. నదిపై వంతెన లేకపోవడంతో ఆమెను రబ్బరు ట్యూబుపై ఉంచి భర్త, ఇతరులు ఇటీవల నదిని దాటారు. అనంతరం మహాసింఘ్‌ నుంచి ఆమెను అంబులెన్స్‌లో బలిగుడలోని ఆసుపత్రికి తరలించారు. కుబేరముండా గ్రామంలో పదిహేను కుటుంబాలు ఉన్నాయి. వారంతా ఖడ్గ నది నీటిలో రాకపోకలు సాగిస్తుంటారు. వర్షాకాలంలో నదిలో నీటి ప్రవాహం పెరిగితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నది మీదుగా మహాసింఘ్‌కు రెండు కి.మీ. దూరం ఉండగా, కె.నువాగాంకు వెళ్లేందుకు చుట్టూ తిరిగి 22 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వారు ప్రమాదమని తెలిసినా నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఖడ్గ నదిపై వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

రోగి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని