logo

రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు

జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్‌ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్‌లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు.

Published : 27 Apr 2024 05:55 IST

రాయగడ, న్యూస్‌టుడే: జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్‌ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్‌లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. రాయగడకు 22 సెట్లు, గుణుపురం 21 సెట్లు, బిసంకటక్‌కు 19 అందినట్లు ఆమె పేర్కొన్నారు.

త్రిముఖ పోరు: రాయగడ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. బిజద అభ్యర్థినిగా తొలిసారిగా మహిళ పోటీ చేస్తున్నారు. రాజకీయ రంగంలో అనుభవం ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా తొలిసారి అనుసూయ మాఝి బిజద నుంచి రంగంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా అప్పలస్వామి కడ్రక, భాజపా నుంచి బసంత ఉలక పోటీ చేస్తున్నారు.

కాశీపూర్‌ ప్రజలే కీలకం

జిల్లాలో అతి పెద్ద సమితి అయిన కాశీపూర్‌ ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపితే వారే గెలిచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభ్యర్థులు కాశీపూర్‌ సమితి పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అనుసూయ రాయగడలో నివాసం ఉంటున్నప్పటికి ఆమె కాశీపూర్‌ సమితికి చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ప్రజలు ఆమెను తమ బిడ్డగా ఆదరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాశీపూర్‌ ప్రాంతానికి చెందిన మకరంద ముదిలి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 4 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బిజద అభ్యర్థి, సీనియర్‌ నాయకుడు లాల్‌ బిహారీ హిమిరికకు 47,972 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అప్పల స్వామి కడ్రకకు 39,657, భాజపా అభ్యర్థి బసంత ఉలకకు 24,425 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే మకరంద ముదులి పోటీ చేయడం లేదు. బిజద అభ్యర్థికి మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. గెలుపే ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని