logo

హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి

‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సవాల్‌ విసిరారు.

Published : 27 Apr 2024 05:57 IST

నవీన్‌కు ధర్మేంద్ర సవాల్‌

రోడ్‌ షోలో ధర్మేంద్ర ప్రధాన్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సవాల్‌ విసిరారు. శుక్రవారం సంబల్‌పూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బరగఢ్‌ జిల్లా బిజెపూర్‌ నుంచి పోటీ చేసిన సీఎం ప్రజలకిచ్చిన హామీల్లో ఏమేం నెరవేర్చారన్న దానిపై శ్వేతపత్రంలో పేర్కొనాలన్నారు. ఈసారి మళ్లీ హింజిలి, కంటాబంజి నుంచి పోటీ చేస్తున్న నవీన్‌ గడిచిన రెండున్నర దశాబ్దాల కాలంలో కంటాబంజి అభివృద్ధి, వలసల నివారణకు ఏం చేశారన్నది వివరించాలని ధర్మేంద్ర డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని