logo

విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి

విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన  గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని బేతర్ సింగ్ గ్రామంలో జరిగింది.  

Updated : 27 Apr 2024 13:08 IST

పర్లాఖెముండి : విద్యుదాఘాతంతో వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన  గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని బేతర్ సింగ్ గ్రామంలో జరిగింది.  ఠాణా అధికారి బసంత్ శెఠి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి  చెందిన ప్రమోద్ దోలాయ్ (60) శుక్రవారం అర్ధరాత్రి  ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో రహదారిపై పడి ఉన్న విద్యుత్‌వైర్లకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.  ప్రమోద్‌ దోలాయ్‌ ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి  కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి చూశారు.  రహదారిపై పడి ఉన్న ప్రమోద్‌ దోలాయ్‌ను గమనించిన కుటుంబసభ్యులు.. మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ప్రమోద్‌  మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి  దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 


విద్యుదాఘాతంతో రైతు మృతి

బరంపురం: గంజాం జిల్లా, బుగుడ బ్లాక్‌లోని తలోసాకరో గ్రామానికి చెందిన రైతు అరున్‌ నాయక్‌(37) మృతి చెందారు. నిన్న రాత్రి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి వన్యప్రానుల వేటకు అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని