logo

వర్ష బీభత్సం

కొరాపుట్‌ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పెనుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాల్ని మిగిల్చింది.

Published : 30 Apr 2024 05:03 IST

సువాయి వద్ద నెలకొరిగిన భారీ వృక్షం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం పెనుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాల్ని మిగిల్చింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో వేడి భరించలేక ప్రజలు విలవిల్లాడారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పెనుగాలులకు జిల్లాలోని నారాయణ ప్రాంతంలో అరటి చెట్లు విరిగిపడ్డాయి. సుమారు రూ.3 లక్షలు నష్టపోయినట్లు రైతు గోవింద రాజు తెలిపారు. సిమిలిగుడ సమితి సువాయి వద్ద రోడ్డుకు అడ్డంగా భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ కన్య ఆశ్రమం ప్రవేశ ద్వారం గాలికి  పడిపోయింది. రెంగా పంచాయతీ మరువలో ఒక ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. అక్కడ ఉన్న కారుపై పైకప్పు రేకులు పడడంతో వాహనం ధ్వంసమైంది. నందపూర్‌ సమితి కీముడు గూడలో ట్రాన్స్‌ఫార్మర్‌ నేలకొరిగింది. విద్యుత్తు తీగలు తెగిపడడంతో  అంధకారం అలముకుంది.  రెంగాలో 4, దుసురలో రెండు, విద్యుత్‌ స్తంభాలు కూలాయి. వర్షం ప్రభావంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని