logo

చికిటిలో యాభై వేల మెజార్టీతో గెలిపించాలి: పాండ్యన్‌

బ్రహ్మపుర లోక్‌సభ, చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్‌, చిన్మయానంద శ్రీరుప్‌ దేవ్‌లను శంఖద్వయం (జొడి శంఖొ) గుర్తుపై ఓటేసి గెలిపించాలని రాష్ట్ర 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్‌ ఓటర్లను కోరారు. నియోజకవర్గం పరిధిలో చికిటిపెంఠొలోని తళొబజారులో మంగళవారం సాయంత్రం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు.

Published : 01 May 2024 02:53 IST

చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థి శ్రీరుప్‌ దేవ్‌ను గెలిపించాలని కోరుతున్న పాండ్యన్‌. చిత్రంలో బ్రహ్మపుర లోక్‌సభ  బిజద అభ్యర్థి భృగుబక్షిపాత్ర్‌, మంత్రి ఉషాదేవి
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర లోక్‌సభ, చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్‌, చిన్మయానంద శ్రీరుప్‌ దేవ్‌లను శంఖద్వయం (జొడి శంఖొ) గుర్తుపై ఓటేసి గెలిపించాలని రాష్ట్ర 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్‌ ఓటర్లను కోరారు. నియోజకవర్గం పరిధిలో చికిటిపెంఠొలోని తళొబజారులో మంగళవారం సాయంత్రం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పాండ్యన్‌ మాట్లాడుతూ జైలు నుంచి వచ్చిన వ్యక్తికి మీరు ఓటేస్తారా? అని పరోక్షంగా బ్రహ్మపుర లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రదీప్‌ పాణిగ్రహిని ఉద్దేశించి అన్నారు. చికిటి అసెంబ్లీ నుంచి లోక్‌సభ బిజద అభ్యర్థి బక్షిపాత్ర్‌ను యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఇంతకుముందు చికిటి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ప్రజలు వివిధ అంశాలపై వినతిపత్రాలు ఇచ్చారని, వాటిని పరిశీలించి సుమారు రూ.45 కోట్లతో వివిధ మందిరాలు, చెరువులు ఇతరత్రా అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని పాండ్యన్‌ చెప్పారు.

ఆదివాసీల అభివృద్ధే ధ్యేయం...  పర్లాఖెముండి న్యూస్‌టుడే: బిజద ప్రచార స్టార్‌, 5టీ అధ్యక్షుడు కార్తికేయ పాండ్యన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మోహన నియోజకవర్గం చంద్రగిరి ప్రాంతానికి వచ్చారు. ఆయన మాట్లాడుతూ మోహన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నవీన్‌ ఎంతో కృషి చేశారని, ఆదివాసీల అభివృద్ధే ధ్యేయంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కళాశాలలు, పాఠశాలల పునరుద్ధరించారన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. బిజు స్వాస్థ్య కల్యాణ యోజన ద్వారా 90 శాతం ప్రజలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంతర్యామి గమాంగ్‌, లోక్‌సభ అభ్యర్థి భృగుబక్షి పాత్ర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

 నవీన్‌ మాటల నేత కాదు చేతల నేత: పాండ్యన్‌...  జయపురం, న్యూస్‌టుడే: కొట్పాడు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, విద్య, ఆరోగ్యంతోపాటు రహదారుల నిర్మాణం జరిగిందని, నవీన్‌ మాటల నేత కాదని చేతల నేతని వి.కె.పాండ్యన్‌ అన్నారు. సోమవారం సాయంత్రం భైరవి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నవరంగపూర్‌ లోక్‌సభ అభ్యర్థి ప్రదీప్‌ మాఝి, కొట్పాడు ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్‌ మాఝికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని