logo

చిట్‌ఫండ్‌ బాధితుల విషయమై నవీన్‌ ఎందుకు మాట తప్పారు?

చిట్‌ఫండ్‌ బాధితులైన 20 లక్షల మందికి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఎందుకు మాట తప్పారో, బాధితులను ఎందుకు నట్టేట ముంచారో సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి సజ్జన్‌ శర్మ డిమాండ్‌ చేశారు

Published : 01 May 2024 02:57 IST

సజ్జిన్‌ శర్మ
భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: చిట్‌ఫండ్‌ బాధితులైన 20 లక్షల మందికి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఎందుకు మాట తప్పారో, బాధితులను ఎందుకు నట్టేట ముంచారో సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి సజ్జన్‌ శర్మ డిమాండ్‌ చేశారు. మంగళవారం భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న చిట్‌కంపెనీల ఆస్తులు స్వాధీనం చేసుకున్న నవీన్‌ ప్రభుత్వం ఏళ్లు గడిచినా న్యాయం చేయకపోవడానికి కారణమేమిటని ప్రశ్నించారు. నవీన్‌ పాలనా కాలంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయని నిందితులు ఎంతమందికి శిక్షలు పడ్డాయో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్రం జల్‌జీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద రూ.10 వేల కోట్లు కేటాయించింది. ఖర్చు చేసింది మాత్రం రూ.834 కోట్లని, మిగతా సొమ్ము ఏం చేశారో చెప్పాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని