logo

సీఎం... గుమస్తా చేతిలో రిమోట్‌: ధర్మేంద్ర

ఒక రాష్ట్రాన్ని బాగు చేయడానికి అయిదేళ్లు చాలునని, నవీన్‌ పట్నాయక్‌కు ఒడిశా ప్రజలు 24 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేకపోవడం ఆయన చేతగానితనం కాదా? అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశ్నించారు.

Published : 09 May 2024 04:17 IST

ఫుట్‌పాత్‌ హోటల్లో విపక్షనేత జయనారాయణ మిశ్రతో కలిసి అల్పాహారం తింటున్న ధర్మేంద్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఒక రాష్ట్రాన్ని బాగు చేయడానికి అయిదేళ్లు చాలునని, నవీన్‌ పట్నాయక్‌కు ఒడిశా ప్రజలు 24 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయలేకపోవడం ఆయన చేతగానితనం కాదా? అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రశ్నించారు. బుధవారం సంబల్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నవీన్‌ వీడియోల్లో కనిపిస్తున్నారని, ఆయన గుమస్తా చేతిలో రిమోట్‌ ఉందని, నిస్సహాయమైన ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చి ఏం చేయగలరని ప్రశ్నించారు. ఆయన హయాంలో ఏ రంగంలోనైనా అభివృద్ధి జరిగిందా అన్నదానిపై బహిరంగ చర్చకు బిజద పెద్దలు ముందుకొస్తే తాను సిద్ధమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని