logo

ఒడిశా రాజకీయాల్లో చారిత్రక మలుపు ఈ ఎన్నికలు

ఒడిశా రాజకీయాల్లో ఈ ఎన్నికలు చారిత్రక మలుపు తిప్పుతాయని, బ్రహ్మపురలో ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలివచ్చిన జన సందోహం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అన్నారు.

Published : 09 May 2024 04:18 IST

కేంద్రమంత్రి భూపేందర్‌ యాదవ్‌

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భూపేందర్‌ యాదవ్‌. చిత్రంలో భాజపా నేతలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఒడిశా రాజకీయాల్లో ఈ ఎన్నికలు చారిత్రక మలుపు తిప్పుతాయని, బ్రహ్మపురలో ప్రధాని మోదీ బహిరంగ సభకు తరలివచ్చిన జన సందోహం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖల మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం ఉదయం గాంధీనగర్‌లోని భాజపా బ్రహ్మపుర జోన్‌ మీడియా సెంటర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నాలుగు నగరాల్లో ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామని, వీటిలో బ్రహ్మపురలో ఒకటి నెలకొల్పుతామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న బ్రహ్మపుర లోక్‌సభ భాజపా అభ్యర్థి ప్రదీప్‌ కుమార్‌ పాణిగ్రహి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న హింజిలి నియోకవర్గం నుంచి 55 శాతం మంది వలస వెళుతున్నారన్నారు. ఇటీవల స్థానిక ప్రైవేటు అతిథి భవనం (లాడ్జి)పై దాడి చేసిన ఎన్నికల అధికారులు రూ.3 కోట్లు గుర్తించారంటూ బ్రహ్మపురలో వార్తలు వినిపిస్తున్నాయని ప్రదీప్‌ పాణిగ్రహి పేర్కొన్నారు. ఈ సొమ్ము ఏ రాజకీయ పార్టీకి చెందినదో? పోలీసులు బహిర్గతం చేయాలన్నారు. పార్టీ గంజాం జిల్లా అధ్యక్షుడు సుభాష్‌ సాహు, బబితా పాత్ర్‌, విష్ణు దాస్‌, సునీల్‌ సాహు, జి..రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని