logo

భూకమతాల గణనపై అవగాహన అవసరం

ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే 11వ సాగుదారుల భూకమతాల గణనపై ప్రతి ఒక్కరికి అవగాహన

Updated : 26 Sep 2022 16:45 IST

బలిజిపేట: ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే 11వ సాగుదారుల భూకమతాల గణనపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని పార్వతీపురం డివిజన్‌ ఉపగణాంక అధికారి జయప్రకాశ్‌ అన్నారు. బలిజిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలకు సోమవారం ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మొదటి దశలో సాగు కమతాల గణన, రెండో దశలో పంటల వివరాలు, నీటివనరులు, మూడో దశలో యంత్ర పరికరాలు, పనిముట్ల ఉపయోగంపై సర్వే నిర్వహించాలన్నారు. భారత వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కార్మిక, సామాజిక, సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 31లోగా వీఆర్వోలు మొబైల్‌ యాప్‌ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వీవీఎస్‌ శర్మ, బలిజిపేట గణాంక అధికారి విజయరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని