logo

‘రాక్షస పాలనను సాగనంపాల్సిందే’

రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 04:20 IST

విజయనగరం తోటపాలెం పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వస్తున్న పీసీసీ, డీసీసీ ప్రతినిధులు రుద్రరాజు, రమేష్‌కుమార్‌ తదితరులు

విజయనగరం మయూరికూడలి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రాక్షస పాలనను సాగనంపాల్సిందేనని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను హౌస్‌ అరెస్టులు చేసి ఇబ్బందులకు గురిచేస్తోందని, పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి సచివాలయ, వాలంటీరు వ్యవస్థను తెచ్చిందని, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే జీవో ఒకటిని ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అప్పట్లో కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిందేనని అన్నారు. అనంతరం నాయకులతో కలిసి బాలాజీ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకూ ర్యాలీ చేపట్టారు. చిరువ్యాపారులు, మహిళలు, రైతులు, విద్యార్థులు, ఆటో కార్మికులకు కరపత్రాలు అందజేశారు. వారితో కలసి రెండు కి.మీ. వరకు ర్యాలీ చేశారు. డీసీసీ అధ్యక్షుడు సరగడ రమేష్‌కుమార్‌, పట్టణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సుంకర సతీష్‌ కుమార్‌, ఏఐసీసీ కో-ఆర్డినేషన్‌ సభ్యుడు శ్రీరామ్మూర్తి, జోడో యాత్ర ఇన్‌ఛార్జులు అంబటి కృష్ణ, పరమేశ్వరరావు, మైనార్టీ విభాగం నాయకులు షరీఫ్‌, జిల్లా నాయకులు శ్రీనివాసరావు, సుంకర అప్పలనాయుడు, నియోజవర్గాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని