logo

గ్లోబల్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు ప్రదానం

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో చేస్తున్న విశేష కృషికి గాను గంట్యాడకు చెందిన, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవోగా ఉన్న సుంకరి చిన అప్పలనాయుడు(శ్రీను)కు గ్లోబల్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు దక్కింది.

Published : 06 Feb 2023 04:29 IST

గంట్యాడ, న్యూస్‌టుడే: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో చేస్తున్న విశేష కృషికి గాను గంట్యాడకు చెందిన, ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవోగా ఉన్న సుంకరి చిన అప్పలనాయుడు(శ్రీను)కు గ్లోబల్‌ ఎక్స్‌లెన్సీ అవార్డు దక్కింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తొలుత టెక్‌మహీంద్రాలో పనిచేశారు. అనంతరం సొంతంగా స్కీమ్యాక్స్‌ కంపెనీని పెట్టారు. విశాఖలో రెండు బ్యాంచ్‌లు నిర్వహిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని