logo

గాలివాన బీభత్సం

సీతంపేట మన్యంలోని కీసరజోడు, చిన్నబగ్గ, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో గాలివాన బుధవారం సాయంత్రం బీభత్సం సృష్టించింది.

Published : 30 Mar 2023 02:14 IST

నడిమిగూడలో వర్షపు నీటిలో పొద్దు తిరుగుడు పంట

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మన్యంలోని కీసరజోడు, చిన్నబగ్గ, మర్రిపాడు తదితర ప్రాంతాల్లో గాలివాన బుధవారం సాయంత్రం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు నడిమిగూడలో నాలుగు విద్యుత్తు స్తంభాలు విరిగిపడటంతో సరఫరా నిలిచిపోయింది. సవర తిక్కమయికి చెందిన అరెకరా జామతోట దెబ్బతింది. పలుచోట్ల అరటిచెట్లు, కొండ పోడులో పంటలు పాడయ్యాయి. పొద్దు తిరుగుడు, మొక్కజొన్న నేల    మట్టం కాగా జీడి, మామిడికి నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని