logo

ప్రజావ్యతిరేక పాలకుడు జగన్‌

ప్రజావ్యతిరేక పాలకుడు జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు.

Published : 20 Apr 2024 03:44 IST

చిననాగళ్లవలసలో కళావెంకటరావుకు హారతి ఇస్తున్న మహిళలు

గుర్ల, చీపురుపల్లి, న్యూస్‌టుడే: ప్రజావ్యతిరేక పాలకుడు జగన్‌కు రోజులు దగ్గర పడ్డాయని, వైకాపా వచ్చిన తర్వాత దోపిడీ ఎక్కువైందని చీపురుపల్లి ఎన్డీయే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెడతారన్నారు. శుక్రవారం రాత్రి చిననాగళ్లవలస, తాటిపూడి గ్రామాల్లో జరిగిన ఎన్నికల సభల్లో ప్రసంగించారు. నాలుగున్నరేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్‌ను వదలని సీఎం జగన్‌ ఎన్నికలు వచ్చాయని ప్రజల మధ్యకు వస్తున్నారన్నారు. గద్దె బాబూరావు, కె.త్రిమూర్తులరాజు(కేటీఆర్‌), వెన్నె సన్యాసినాయుడు, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చీపురుపల్లిలో పట్టణ తెదేపా కార్యాలయాన్ని కిమిడి కళా వెంకటరావు ప్రారంభించారు.

మద్దతు ఇవ్వాలి..

చీపురుపల్లి, గరివిడి, గుర్ల, న్యూస్‌టుడే: చీపురుపల్లిలోని ఆంజనేయపురం కాలనీలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులతో కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు శుక్రవారం సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ః గరివిడి పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీ సంఘం నేత సలీం వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు, నేతలు పాల్గొన్నారు.

  • గుర్ల మండలం పెనుబర్తిలో సూపర్‌-6 పథకాలపై నేతలు సంచాన సన్యాసినాయుడు, మండల అప్పలనాయుడు, గుషిడి సూర్యారావు ఇంటింటి ప్రచారం చేశారు.

అధిక మెజారిటీ ఖాయం

రాజాం, న్యూస్‌టుడే: కూటమితోనే పేదలకు రెట్టింపు సంక్షేమం అందుతుందని అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ పేర్కొన్నారు. శుక్రవారం నామపత్రాలు దాఖలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెదేపా సూపర్‌-6 పథకాలు పేదలకు మేలు చేస్తాయని ఉద్ఘాటించారు. ఎక్కువ మెజారిటీ వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు.

భారీ చేరికలు

బొండపల్లి: మండలంలోని గొల్లుపాలెం గ్రామానికి చెందిన దాదాపు 400 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వీరికి కొండపల్లి శ్రీనివాస్‌ కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.

సీఎం గారూ.. మద్యపాన నిషేధం ఎక్కడ?

బాడంగి, బొబ్బిలి, రామభద్రపురం, న్యూస్‌టుడే: అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ దాన్ని పూర్తిగా విస్మరించారని కూటమి అభ్యర్థి బేబినాయన అన్నారు. శుక్రవారం సాయంత్రం పినపెంకిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. జగన్‌ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు, జనసేన నాయకుడు గిరడ అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. తెంటు రవిబాబు, సింగిరెడ్డి భాస్కరరావు, ఎల్‌.సత్యం, బొంతు త్రినాథ తదితరులు పాల్గొన్నారు. ః బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బేబినాయన ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అభిమానులు పూల వర్షం కురిపించి, హారతులు ఇచ్చి స్వాగతం పలికారు.  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ః రామభద్రపురంలోని పార్టీ కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ కార్యకర్తలతో సమావేశమై, మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని