logo

కోలగట్ల ఎమ్మెల్యే అయితే భూములు మాయం

విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్‌ ఆరోపించారు.

Published : 28 Apr 2024 04:38 IST

వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్‌

సమావేశంలో మాట్లాడుతున్న గౌరీశంకర్‌

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికైతే ప్రభుత్వ భూములతో పాటు నగరవాసుల భూములు కూడా మాయమవుతాయని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్‌ ఆరోపించారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడారు. ‘అప్పులు తీసుకో.. ఆస్తులు సమర్పించుకో’ అన్న రకంగా ఆయన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అతని వద్ద అప్పులు తీసుకున్న వారిలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. నగరంలోని 30 మంది వరకు బాధితులున్నారని చెప్పారు. రైల్వే మూడోలైన్‌ కోసం జరిగిన భూసేకరణలో రూ.3 కోట్లకు పైగా లాగేశారని ఆరోపించారు. నీతి, నిజాయతీ గల పూసపాటి కుటుంబ సభ్యులు మహరాజా కళాశాల, సంగీత కళాశాల, సంస్కృత కళాశాల, 200 ఎకరాలకు పైగా ఉన్న కోరుకొండ సైనిక పాఠశాలను దానం చేశారని గుర్తు చేశారు. ఆక్రమణలు తప్ప అభివృద్ధి తెలియని కోలగట్లకు వారితో పోలికేంటని ప్రశ్నించారు. ఈ నెల 24న జరిగిన ప్రజాగళం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. చెల్లూరులో జరిగిన జగన్‌ సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు పెట్టినా ఎవరూ వెళ్లలేదని ఎద్దేవా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని