logo

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

ఎన్నికల నిర్వహణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు యంత్రాంగానికి సహకరించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్‌కుమార్‌ మెహర్ద అన్నారు.

Published : 30 Apr 2024 04:42 IST

సాధారణ పరిశీలకుడు పి.కె.మెహర్ద

మాట్లాడుతున్న మెహర్ద, చిత్రంలో కలెక్టరు నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఎన్నికల నిర్వహణలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు యంత్రాంగానికి సహకరించాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకుడు ప్రమోద్‌కుమార్‌ మెహర్ద అన్నారు. సోమవారం ఉపసంహరణల ఘట్టం ముగిసిన తర్వాత తుది జాబితాలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ప్రచారంలో ఎన్నికల సంఘం సూచించిన ప్రవర్తనా నియమావళిని అందరూ అనుసరించాలని అన్నారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రచారాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. ఏ ఇద్దరు అభ్యర్థులకు ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ప్రచారానికి అనుమతులు ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రచారంలో దూషణలు చేసుకోవడం, హింస చెలరేగేందుకు అవకాశం ఉన్న రీతిలో వ్యవహరించకూడదని సూచించారు. అరకు భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాడేరు, అరకు, రంపచోడవరంలో అనుమతులు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

పోలింగ్‌ సమయాలివే..

ఏఎస్‌ఆర్‌ జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుందని రిటర్నింగ్‌ అధికారి నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారాలను మే 11న సాయంత్రం 4 గంటల్లోపు ముగించాలన్నారు. కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు, పార్వతీపురంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని