logo

నారీ.. స్ఫూర్తి

జిల్లాలో మహిళా చైతన్యం ఓటెత్తింది. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే వీరే ఎక్కువ మంది కేంద్రాలకు తరలివచ్చి వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టారు. 7,83,440 మంది ఓటర్లుండగా 4,00,779 మంది మహిళలున్నారు.

Updated : 15 May 2024 07:26 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో మహిళా చైతన్యం ఓటెత్తింది. ఈ సారి ఎన్నికల్లో పురుషుల కంటే వీరే ఎక్కువ మంది కేంద్రాలకు తరలివచ్చి వజ్రాయుధాన్ని ఎక్కుపెట్టారు. 7,83,440 మంది ఓటర్లుండగా 4,00,779 మంది మహిళలున్నారు. ఎండలో నిలబడి, చిన్న పిల్లలను ఎత్తుకొని, కొండలపై నుంచి నడిచివచ్చి మరీ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో 96,292 మందిలో 75,908, కురుపాంలో 99,736 మందికి 78,419 మంది ఓట్లు వేశారు.  

చిన్నారులతో తరలివచ్చి..  

పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కువ సమయం నిరీక్షించాల్సి వచ్చినా ఇబ్బందులకు గురికాలేదు. కొందరు సాయంత్రం ఆరు తర్వాత కూడా వరుసల్లో కనిపించారు. ఏ మారుమూల ప్రాంతాల్లో చూసినా పురుషుల కంటే వీరే ఎక్కువగా ఉన్నారు. పార్వతీపురం మండలం సంగంవలస, సాలూరు మండలంలోని పలు కేంద్రాల్లో చంటి పిల్లలను ఎత్తుకొని ఓట్లేశారు. వృద్ధులు సైతం అడుగులో అడుగు వేసుకుంటూ ఈవీఎంల్లో తమ తీర్పు నిక్షిప్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని