logo

మా ఉద్యోగాలుంటాయా!

 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ఈసారి కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు. గతంలో ఒక రోజు వ్యవధి ఇచ్చి మళ్లీ కొనసాగింపు ఉత్తర్వులిచ్చేవారు.

Published : 23 May 2024 02:47 IST

కాంట్రాక్టు కొనసాగింపునకు కొర్రీలు
341 మందిలో ‘మదింపు’ ఆందోళన

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల భవితవ్యం ప్రమాదంలో పడింది. ఈసారి కొత్త పద్ధతి ప్రవేశపెట్టారు. గతంలో ఒక రోజు వ్యవధి ఇచ్చి మళ్లీ కొనసాగింపు ఉత్తర్వులిచ్చేవారు. ప్రస్తుతం పనితీరు మదింపు ఆధారంగా ఒప్పందం పొడిగింపు సమగ్ర శిక్షా అభియాన్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో తదుపరి సంవత్సరానికి వీరికి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదు. ఈ పరిణామాలతో సదరు ఉద్యోగుల్లో ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

నచ్చకుంటే ఇంటికే...: ఒప్పంద ఉద్యోగుల పనితీరును అంచనా వేసి నివేదికలు పంపాలని ఎస్‌పీడీ కార్యాలయం నుంచి ఇప్పటికే అధికారులకు ఆదేశాలందాయి. ఆ మేరకు బుధవారం నుంచి ఉద్యోగులు సమగ్రశిక్షా కార్యాలయానికి వచ్చి వివరాలు అందజేస్తున్నారు. జిల్లాలో సీఆర్‌టీలు, పీఈటీ, ప్రిన్సిపల్స్‌ 232 మంది ఉండగా, పీజీటీలు 109 మంది ఉన్నారు. వీరు తాము బోధించిన సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతా శాతం ఎంత అనేది వివరాలు అందజేయాల్సి ఉంది. అదేవిధంగా ఇతర ఉద్యోగులు వారి విధి నిర్వహణలో ప్రతిభను నిరూపించుకోవాలి. ఇరవై మార్కులకు మదింపు చేసి పంపుతారు. ఈ విషయంలో స్థానిక అధికారులు వైఖరిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చని వారికి మార్కులు తక్కువ వేస్తారనే ఆందోళన కొందరిలో వ్యక్తమవుతోంది. పనితీరు బాగోలేదంటూ ఉద్యోగాల నుంచి తొలగించేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని