logo
Published : 29/11/2021 04:53 IST

ముప్పు తొలగలేదు.. మాస్కు మరవొద్దు

పండ్ల వ్యాపారులకు హెచ్చరికలు చేస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కొవిడ్‌ కొత్త రూపు దాల్చి వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ సూచించారు. ఎస్పీ మలికాగార్గ్‌, మేయర్‌ సుజాతతో కలసి నగరంలోని కూరగాయల మార్కెట్‌ను ఆయన ఆదివారం పరిశీలించారు. ఇంటి నుంచి బయటికి వచ్చే వారిలో 50 శాతం మాత్రమే మాస్కులు ధరిస్తున్నారని అన్నారు. మాస్కు ధరించడంపై తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు, పండ్ల వ్యాపారులకు సూచనలు చేశారు. నిర్లక్ష్యం వీడి తప్పకుండా మాస్కు ధరించాలన్నారు. వ్యాపారులు, వినియోగదారులు మాస్కు ధరించకపోతే సిబ్బంది ఒకసారి హెచ్చరించి.. రెండోసారి జరిమానా విధిస్తారన్నారు. తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే దుకాణం సీజ్‌ చేస్తామని చెప్పారు. పర్యటనలో ఆయన వెంట సంయుక్త కలెక్టర్‌ కె.కృష్ణవేణి, అదనపు ఎస్పీ బి.రవిచంద్ర, బీసీ సంక్షేమశాఖ అధికారిణి అంజలి, బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ అధికారులున్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని