logo
Published : 02/12/2021 05:36 IST

రైతులను ఆదుకుంటాం

 పంట నష్టాల పరిశీలనలో మంత్రి బాలినేని

దైవాలరావూరులో మినుము పంటను పరిశీలిస్తున్న బాలినేని..

చిత్రంలో జేసీ వెంకటమురళి, శాప్‌నెట్‌ ఛైర్మన్‌ కృష్ణచైతన్య 

మేదరమెట్ల, న్యూస్‌టుడే: భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం కొరిశపాడు మండలంలోని దైవాలరావూరు, మేదరమెట్ల గ్రామాలలో పర్యటించి మినుము, శనగ పంట పొలాలను పరిశీలించారు. ఎకరాకు రూ.30 వేల చొప్పున ఖర్చు చేసి మినుము సాగుచేశామని, అయిదు రోజుల్లో పంట చేతికి రానుండగా వర్షాలతో పోయిందని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 25 ఎకరాల్లో శనగ వేయగా దెబ్బతిందని రైతులు శివశంకరరావు, సుబ్బారావులు వివరించారు. 80 శాతం రాయితీపై విత్తనాలు ఇప్పించాలని, ఈ-క్రాప్‌ నమోదుకు గడువు పొడిగించాలని కోరారు. అనంతరం జిల్లాలో పంట నష్టంపై కొరిశపాడు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షిస్తూ.. నష్టం అంచనాలను వేగంగా నమోదు చేయాలని ఆదేశించారు. పరిహారం అందజేయడంపై ముఖ్యమంత్రికి వివరిస్తానని చెప్పారు. సాగుకు అవసరమైన పెట్టుబడి రుణం, రాయితీ విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. 
కొరిశపాడులోని యర్రం చిన పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని ముంపు గ్రామం తూర్పుపాలెంలో మంత్రి పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 
 నష్టం వివరాలు వెల్లడిస్తూ..
జిల్లాలోని 32 మండలాల్లో 40,889 ఎకరాల్లో ఖరీఫ్, 36 మండలాల్లో 57,236 ఎకరాల్లో రబీ.. మరో 18వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకటమురళి మంత్రికి వివరించారు. నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 288 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. రహదారులకు వాటిల్లిన నష్టాలపై అంచనాలు రూపొందిస్తున్నామని చెప్పారు. శాప్‌నెట్‌ ఛైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య, డీఆర్‌వో సరళవందనం, జడ్పీ సీఈవో బి.జాలిరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ ఎస్‌.శ్రీనివాసరావు, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఉద్యానవన శాఖ ఏడీ నాగబాబు, ఆర్డీవో ప్రభాకరరెడ్డి, ఏఎంసీ ఛైర్మన్‌ భువనేశ్వరి, వైస్‌ ఛైర్మన్‌ యర్రం రత్నారెడ్డి, ఎంపీపీ ప్రసన్నకుమారి, జడ్పీటీసీ వెంకటరమణ, మండల కన్వీనర్‌ మస్తాన్‌రావు, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో రామాంజనేయులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని