logo

రైతు కుటుంబాలకుసత్వర న్యాయం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే గతంలో ఎన్నడూలేని విధంగా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు. తర్లుపాడు మండలంలోని గానుగపెంట,

Published : 22 Jan 2022 04:26 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్‌

గానుగపెంటలో భూరంగయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, నేతలు

తర్లుపాడు, మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే గతంలో ఎన్నడూలేని విధంగా రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. జిల్లాలో శుక్రవారం ఆయన పర్యటించారు. తర్లుపాడు మండలంలోని గానుగపెంట, పోతలపాడు గ్రామాల్లో జనవరి 8న ఆత్మహత్య చేసుకున్న భూరంగయ్య, సత్యనారాయణరెడ్డి అనే రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల పశ్చిమ ప్రకాశం రైతులు అధిక మొత్తంలో బోర్లకే అప్పులు చేస్తున్నారన్నారు. మిరప, పండ్ల తోటలు సాగు చేసి అప్పు తీర్చే ప్రయత్నంలో రెండేళ్లుగా సరైన దిగుబడి రాక.. అప్పు ఇచ్చినవారికి చెల్లించే మార్గం కనిపించక ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త రాయితీలు ఇవ్వకపోగా గతంలో ఉన్న బిందు సేద్యం, యాంత్రీకరణ పరికరాలు, ఎరువుల మందులపై ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. బేస్తవారపేట మండలం పిటికాయగుళ్లలో అప్పులబాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు చిలకల ఈశ్వర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మార్కాపురంలో విలేకర్లతో మాట్లాడుతూ ఈ రైతు కుటుంబాలకు ప్రభుత్వం సత్వరం రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాలతో ఒనగూరే ప్రయోజనం శూన్యమన్నారు. కార్యక్రమంలో సీపీఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శి సయ్యద్‌ హనీఫ్‌, జిల్లా నాయకులు గాలి వెంకట రామిరెడ్డి, పిల్లి తిప్పారెడ్డి, వెంకటేశ్వర్లు, మార్కాపురం పట్టణ కార్యదర్శి డి.సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని